Friday, July 22, 2011

ఆత్మహత్యల రాజకీయాలు

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రపంచం లో ఎక్కడా కనిపించని , వినిపించని ఆత్మ హత్యల సంఘటనలు వినిపిస్తున్నై.
చరిత్రలో ఇంతవరకు ఆత్మ హత్య లు చేసుకునే వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మ హత్య లు చేసుకోవటం విన్నాము. డిప్రెషన్ , పరీక్షల లో అపజయం , అప్పుల భాధలు ఆత్మ హత్య కు ముఖ్య కారణాలు.
ఉద్యమాలలో సాధారణముగా నిరాహార దీక్షల వల్ల మృతి చెందటానికి ఆస్కారం వుంది.

YS రాజ శేఖర రెడ్డి చని పోయినపుడు ఆ భాద కి తట్టు కో లేక ప్రజలు ఆత్మ హత్య లు చేసుకున్నారు అని ప్రచారం చేయటం అతి దారుణమైన విషయం. సొంత తల్లి, తండ్రి చనిపోతేనే ఎవరు ఆత్మ హత్య కోవటం లేదు అటువంటిది ఒక CM చనిపోతే ఎవరు ఆత్మ హత్య చేసుకుంటారు? గాంధి చనిపోతేనే ఎవరు ఆత్మ హత్య చేసుకోలేదు ...YS రాజ శేఖర రెడ్డి చనిపోతే ప్రజలు గుండెలు ఆగి పోయాయ్ అనటము ప్రజలను వెర్రి వాళ్ళ కింద చూడటమే , ప్రజలను మూర్ఖు ల కింద జమ కట్టటమే. వేరే కారణాల వల్ల చనిపోయిన వాళ్లకు డబ్బు లు ఇచ్చ్చి CM చనిపోయినందుకు గుండె ఆగి చనిపోయారని చెప్పించుకున్నారని ఒక ముంబై న్యూస్ పేపర్ పరిశోధన చేసి నిజాన్ని చూపించింది

YS రాజ శేఖర రెడ్డి చనిపోయి సంవత్సరం పైబడిన కూడా ఇంకా అదే విషయాన్నీ పదే పదే గుర్తు చేస్తూ, మరచిపోనివ్వకుండా , అ విషయం మీద ప్రచారం చేసుకుని అధికారాన్ని అందుకోవాలని చూస్తున్న జగన్
ప్రవర్తన శవ రాజకీయమే

అలానే తెలంగాణా కోసం ఆత్మ హత్యలు అని ప్రచారం చేసే వైనం కూడా ఆలోచించాల్సిన విషయం. ఎక్కడా కూడా ఈ 'ఆత్మ హత్య' ల మీద పోలీసు కేసు గాని , పరిశోధన గాని జరిగిన దాఖలాలు లేవు.
ఎవరికీ అయిన విషమిచ్చి , ఎవరిని అయినా చంపి ఆత్మా హత్య అని ప్రచారం చేసే ప్రమాదం పొంచి వుంది. ఎక్కడా కూడా ఒక చోటా నాయకుడు గాని, విద్యార్థి నాయకుడు గాని, బడా నాయకుడు గాని ఆత్మ హత్య చేసుకోలేదు ! ఎప్పుడు ఈ ఆత్మహత్యల రాజకీయాలు , ప్రేరేపింపులు , ఓదార్పు నాటకాలు ఆగుతాయో? దేవుడా కాపాడు ....కాపాడు

నా ఉద్దేశం లో తెలంగాణా ప్రజలు ఆత్మహత్య చేసుకొనే పిరికి వాళ్ళు కాదు.. తెలంగాణా ప్రజలు ఆత్మ హత్య లు చేసుకుంటున్నారు అనటం ఒక కుట్ర , తెలంగాణా ప్రజల్ని అవమానిచటం, అవహేళన చేయటం,
చనిపోయిన వాళ్ళ మీద రాజకీయ వ్యాపారం చేయటమే.

ఎప్పుడు ఈ ఆత్మహత్యల రాజకీయాలు , ప్రేరేపింపులు , ఓదార్పు నాటకాలు ఆగుతాయో? దేవుడా కాపాడు ....కాపాడు