Friday, June 8, 2012

ఎన్నికలోచ్చే... ఎన్నికలోచ్చే... ఓరబ్బీ ఓటరుగా...

( డా.సి.నా.రె కు క్షమాపణ ల తో ..వారి అద్భుతమయిన 'గోగులు పూచె...గోగులు పూచె ..' గీతాన్ని వాడుకున్నందుకు..)

ఎన్నికలోచ్చే... ఎన్నికలోచ్చే... ఓరబ్బీ ఓటరుగా
ఎన్నో కలలూ ...ఎన్నో కలలూ ..ఓరబ్బీ ఓటరుగా

ఎన్నికలోచ్చే... ఎన్నికలోచ్చే ఓరబ్బీ ఓటరుగా
మళ్ళీ వచ్చే .... మళ్ళీ వచ్చే ...ఓరబ్బీ ఓటరుగా

ఓరబ్బీ ఓటరుగా ..ఓరబ్బీ ఓటరుగా

మందూ పంచె ..మందూ పంచె...ఓరబ్బీ..పార్టీలు
డబ్బులు పంచె ...డబ్బులు పంచె ఓరబ్బీ..పార్టీలు
మందూ పంచె ..డబ్బులు పంచె...ఓరబ్బీ..పార్టీలు

మందు కాదది... నీ మొద్దు మోమున పోసిన విషపు చుక్కలే సుమా
మందు కాదది... నీ మొద్దు మోమున పోసిన విషపు చుక్కలే సుమా
డబ్బులు కావవి... నీ భవిత కు వేసిన వురి తాడులే సుమా

ముందర వున్నబ్రతుకులు చూడు ఓరబ్బీ ఓటరుగా
కన్నీటి...బ్రతుకులు చూడు ఓరబ్బీ ఓటరుగా ..

ముందర వున్నబ్రతుకులు చూడు ఓరబ్బీ ఓటరుగా
కన్నీటి...బ్రతుకులు చూడు ఓరబ్బీ ఓటరుగా ..

బ్రతుకులు కావివి... నీ ఓటును అమ్మిన పాపపు చేతలే సుమా
బ్రతుకులు కావివి... నీ భవితన కమ్మిన కారు మబ్బులే సుమా
ఎన్నిక కాదిది.... మన జేబుకి పెట్టిన కన్నమే సుమా

నేతలు వచ్చే ... నేతలు..వచ్చే ..ఓరబ్బీ ఓటరుగా
ఆశలు చూపీ ...కోతలు కోసే.....ఓరబ్బీ ఓటరుగా

నేతలు వచ్చే ... నేతలు..వచ్చే ..ఓరబ్బీ ఓటరుగా
ఆశలు చూపీ ...కోతలు కోసే.....ఓరబ్బీ ఓటరుగా

కోతలు కావవి ...ఆ నేతల నీతి హీనత చాటిన చేతలే సుమా...
కోతలు కావవి ...ఆ నేతల నీతి హీనత చాటిన చేతలే సుమా...
ఆశలు కావవి..మన జనతకు దొరకని  సరి నేతలే సుమా...


 






Friday, July 22, 2011

ఆత్మహత్యల రాజకీయాలు

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రపంచం లో ఎక్కడా కనిపించని , వినిపించని ఆత్మ హత్యల సంఘటనలు వినిపిస్తున్నై.
చరిత్రలో ఇంతవరకు ఆత్మ హత్య లు చేసుకునే వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మ హత్య లు చేసుకోవటం విన్నాము. డిప్రెషన్ , పరీక్షల లో అపజయం , అప్పుల భాధలు ఆత్మ హత్య కు ముఖ్య కారణాలు.
ఉద్యమాలలో సాధారణముగా నిరాహార దీక్షల వల్ల మృతి చెందటానికి ఆస్కారం వుంది.

YS రాజ శేఖర రెడ్డి చని పోయినపుడు ఆ భాద కి తట్టు కో లేక ప్రజలు ఆత్మ హత్య లు చేసుకున్నారు అని ప్రచారం చేయటం అతి దారుణమైన విషయం. సొంత తల్లి, తండ్రి చనిపోతేనే ఎవరు ఆత్మ హత్య కోవటం లేదు అటువంటిది ఒక CM చనిపోతే ఎవరు ఆత్మ హత్య చేసుకుంటారు? గాంధి చనిపోతేనే ఎవరు ఆత్మ హత్య చేసుకోలేదు ...YS రాజ శేఖర రెడ్డి చనిపోతే ప్రజలు గుండెలు ఆగి పోయాయ్ అనటము ప్రజలను వెర్రి వాళ్ళ కింద చూడటమే , ప్రజలను మూర్ఖు ల కింద జమ కట్టటమే. వేరే కారణాల వల్ల చనిపోయిన వాళ్లకు డబ్బు లు ఇచ్చ్చి CM చనిపోయినందుకు గుండె ఆగి చనిపోయారని చెప్పించుకున్నారని ఒక ముంబై న్యూస్ పేపర్ పరిశోధన చేసి నిజాన్ని చూపించింది

YS రాజ శేఖర రెడ్డి చనిపోయి సంవత్సరం పైబడిన కూడా ఇంకా అదే విషయాన్నీ పదే పదే గుర్తు చేస్తూ, మరచిపోనివ్వకుండా , అ విషయం మీద ప్రచారం చేసుకుని అధికారాన్ని అందుకోవాలని చూస్తున్న జగన్
ప్రవర్తన శవ రాజకీయమే

అలానే తెలంగాణా కోసం ఆత్మ హత్యలు అని ప్రచారం చేసే వైనం కూడా ఆలోచించాల్సిన విషయం. ఎక్కడా కూడా ఈ 'ఆత్మ హత్య' ల మీద పోలీసు కేసు గాని , పరిశోధన గాని జరిగిన దాఖలాలు లేవు.
ఎవరికీ అయిన విషమిచ్చి , ఎవరిని అయినా చంపి ఆత్మా హత్య అని ప్రచారం చేసే ప్రమాదం పొంచి వుంది. ఎక్కడా కూడా ఒక చోటా నాయకుడు గాని, విద్యార్థి నాయకుడు గాని, బడా నాయకుడు గాని ఆత్మ హత్య చేసుకోలేదు ! ఎప్పుడు ఈ ఆత్మహత్యల రాజకీయాలు , ప్రేరేపింపులు , ఓదార్పు నాటకాలు ఆగుతాయో? దేవుడా కాపాడు ....కాపాడు

నా ఉద్దేశం లో తెలంగాణా ప్రజలు ఆత్మహత్య చేసుకొనే పిరికి వాళ్ళు కాదు.. తెలంగాణా ప్రజలు ఆత్మ హత్య లు చేసుకుంటున్నారు అనటం ఒక కుట్ర , తెలంగాణా ప్రజల్ని అవమానిచటం, అవహేళన చేయటం,
చనిపోయిన వాళ్ళ మీద రాజకీయ వ్యాపారం చేయటమే.

ఎప్పుడు ఈ ఆత్మహత్యల రాజకీయాలు , ప్రేరేపింపులు , ఓదార్పు నాటకాలు ఆగుతాయో? దేవుడా కాపాడు ....కాపాడు

Saturday, March 5, 2011

మార్చి 4, 2011: విశాఖపట్నం లో కొడవలి కత్తి పోటుకి బలిఅయి అసువులు బాసిన కృష్ణ వేణి కి నా అసృతర్పణాలతో

విశాఖ రహదార్లో వైపరీత్యం
రాజమండ్రి లో గొడ్డలి పెట్టు
వరంగల్ లో ఆసిడ్ పోత
ప్రతిచోట ఈవ్ టీసింగ్

చట్టం తన పని తను చేసుకు పోతూంది..ప్రవచిస్తారు మంత్రులు
చట్టం ఎదుటే క్రిమినల్సూ కూడా వాళ్ళ పని వారు చేసుకు పోతున్నారు

ఎక్కడ నారి పూజింప బడుతుందో అక్కడ దేవతలు నాట్యం చేస్తారట
ఇక్కడ నారి నరక బడుతుంటే ఇక్కడ చట్టం చుట్టం చూపు చూస్తోంది

సినిమాల్లో స్త్రీ అంగాంగం ప్రదర్శింప బడంగ
మద్యం ఏరులై, గంగలై, సంద్రాలై పొంగంగ.. పారంగ
మదం పోట్లెత్తదా మనిషిలో.. అసురుడు ఉదయించడా
మానవత్వం వుడాయించదా మహిలో సుమతీ

Friday, April 24, 2009

Meeting No.111 Dt.22-Apr-09

INDIAN CLUB TOASTMASTERShttp://www.apaypo.org/toastmasters/images/location1.jpghttp://photos1.meetupstatic.com/photos/event/4/9/f/1/highres_1398929.jpeg

 

Meeting No. 111 Dt. 22-Apr-09

 

It was a nice meeting we had on 22-Apr-09.

 MTM Anita, TM of the Day presented a nice and different Theme of the Day i.e., 'Birthdays'.

The evening was informative. We came to know about the importance of Birthdays in our lives, through the nice speeches from MTM Anita, TM Sivadasan in particular and from the opinions of the role players on the theme.

Table Topics was conducted by TM Pradeep. This too was different and interesting. 

The topic 'Cheer leaders bring color and crowd to the IPL matches', took all in to participation.

TM Shabbeer presented Project 1.TM Sivadasan evaluated this speech.

As mentioned by TM Sivadasan there was no ‘ice’, but for cream in the speech.

Congratulations TM Shabbeer!

ROLE PLAYERS 

TM of the Day   

 MTM Anita Samanta 

Grammarian

TM Prasanth 

Ah! Counter

TM Mohammed Kassim 

Timer

TM Gopal 

Listener

TM Abdul Ghaffor 

Table Topics Master

TM Pradeep Menon 

General Evaluator

TM Joseph Stanley

---------------------------------------------------------------------------------------------------------------------------

Members attended: 13 

------------------------------------------------------------------------------------------------------------------------------

Please do allocate just 2hrs in a fortnight.  

Hope to see you all in the next meeting on 13-May-09

================================================================

Eighty percent of success is showing up.

--Woody Allen

=================================================================

 

Regards

Raveendra

Sgt @ arms

INDIAN TOASTMASTERS CLUB